రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎన్నడూ చూడని విధంగా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ప్రస్తుతం ప్రభుత్వ పాలన గురించే చర్చ జరుగుతోందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం (Welfare), అభివృద్ధిని (Development) ప్రజలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు (People) మెరుగైన పరిపాలన అందించామని తాము గర్వంగా చెప్పగలమన్నారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలను (Manifesto) మరచిపోయే రాజకీయ సంస్కృతికి ముగింపు పలికి, ఎన్నికల హామీలకు (Election Promises) విలువ తీసుకొచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని జగన్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే 99 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమం నుంచి గిరిజన అభివృద్ధి వరకు.. తమ పాలన ప్రత్యేకమన్న జగన్
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ కార్యక్రమాలను నిర్ణీత క్యాలెండర్ (Calendar) ప్రకారం అమలు చేశామని జగన్ గుర్తు చేశారు. విద్య(Education), వైద్యం(Healthcare), వ్యవసాయం (Agriculture) వంటి కీలక రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), ఆస్పత్రుల (Hospitals) రూపురేఖలను పూర్తిగా మార్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించామని చెప్పారు. రైతులకు(Farmers) అన్ని విధాలా అండగా నిలిచామని, ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరేలా వ్యవస్థను రూపొందించామని వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని, 3 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను గిరిజన కుటుంబాలకు పంపిణీ చేశామని తెలిపారు. పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీని తీసుకొచ్చామని చెప్పారు. ఐటీడీఏ (ITDA) పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు.. హామీలు అమలు కాలేదన్న ఆరోపణ
ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేసిందని జగన్ అన్నారు. తాను మరణించిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండేలా ప్రజల కోసం సేవ చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలు దాటిన మహిళలకు(Womens) ఆర్థిక సాయం (Financial Assistance), అమ్మ ఒడి(Amma Vodi), అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) వంటి కీలక పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు.
పాదయాత్ర ప్రకటన.. జగన్ 2.0 ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాల పాలన మాత్రమే మిగిలి ఉందని జగన్ వ్యాఖ్యానించారు. మరో ఏడాదిన్నరలో తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర (Padayatra) ప్రారంభిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. చీకటి కొంతకాలమే ఉంటుందని, వెలుగు రావడం మాత్రం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున మరింత బలంగా పోరాడాలని, బాధితులకు అండగా నిలవాలని, పేదలకు సహాయం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే జగన్ 2.0 (Jagan 2.0) ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు (Party Cadres) మరింత ప్రాధాన్యత కల్పిస్తానని, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తల చేతుల మీదుగానే ప్రజలకు చేరేలా వ్యవస్థను రూపొందిస్తానని వైఎస్ జగన్ తెలిపారు.





