---Advertisement---

టీటీడీ నెయ్యి రీ-సప్లై వెనుక దాగిన రహస్యం

February 3, 2026

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టిటిడి) (TTD) 2024 ఆగస్టు నెలలో ఉపయోగించిన నెయ్యి (Ghee) సరఫరాపై సీబీఐ(CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) చేసిన విచారణ సంచలనమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 06.05.2025న దాఖలైన ప్రాథమిక చార్జ్ షీట్ అలాగే 22.01.2026న దాఖలైన అనుబంధ చార్జ్ షీట్‌ల ఆధారంగా, జూలై 2024లో కల్తీ కారణంగా తిరస్కరించబడిన నెయ్యి ట్యాంకర్లు అక్రమంగా మళ్లించబడి, తిరిగి ఆగస్టు 2024లో మరో సరఫరాదారుడి పేరుతో టిటిడికి తిరిగి సరఫరా చేయబడ్డాయని సిట్ స్పష్టం చేసింది. (ఈ రెండూ కూటమి పాలనలోనే అవ్వడం గమనార్హం)

సిట్ నివేదికల ప్రకారం, ఎఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన నాలుగు నెయ్యి ట్యాంకర్లు ల్యాబ్ పరీక్షల్లో విఫలమై అధికారికంగా తిరస్కరించబడ్డాయి. అయితే, అవి అక్కడే డిస్పొజ్ చేయబడకుండా, అసలు సరఫరాదారునికి తిరిగి పంపకుండా, పూనబాక సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో దాచబడ్డాయని, అనంతరం శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Sri Vaishnavi Dairy Specialties Private Limited) ద్వారా టిటిడికి తిరిగి సరఫరా చేయబడ్డాయని విచారణలో తేలిందంటూ సిట్ తన చార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది.

కల్తీ కారణంగా ఒకసారి టీటీడీ తిరస్కరించబడ్డ ఆ ట్యాంకర్లు అలాగే మరోసారి వస్తే వాటిని అనుమతించడం వెనుక కూటమి సర్కార్ పాలనలోనే ముడుపులు చేతులుమారాయనే ఆరోపణలు ఇప్పుడూ బలంగా వినపడుతున్నాయి. చార్జ్ షీట్లలో స్పష్టంగా పేర్కొన్నట్లు, ఆగస్టు 2024లో టిటిడి ఈ కల్తీ నెయ్యిని స్వీకరించి వినియోగించిందన్న అంశం ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా మారింది. కూటమి పాలనలోనే నెయ్యి కల్తీ అవ్వడం , దానిని వినియొగించడమూ జరిగితే, ఈ అవినీతి గురించి ప్రస్తావించకుండా నాటి మా వైసీపీ ప్రభుత్వంపైన నిరాధార నిందలు ఎలా వేస్తారు అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నాయకులు.

రోజుకోక మలుపు తిరుగుతూ ఉన్న ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చూస్తుంటే రాజకీయంగా టీడీపీ (Telugu Desam Party) జనసేన పార్టీనే (Jana Sena Party) ప్రజల్లో పలచన అయిందా అనిపించక మానదు. జంతువులు కోవ్వు కలిసింది అని అసత్యాలు పలికి ప్రజలల్లో పలనచన అయ్యారు అనుకునే లోపు అసలు రసాయనాలు కలిసిన కల్తీ నెయ్యి సరఫరా అయింది కూడా తెలుగుదేశం పాలనలోనే అని బయటపడటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు టీడీపీ నాయకులు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment