---Advertisement---

ఆ జనసేన ఎమ్మెల్యేకి ఆరు మందితో అక్రమ సంబంధం – బాధితురాలి షాకింగ్ కామెంట్స్

February 4, 2026

---Advertisement---

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ (Arava Sridhar)పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల్లో రోజుకోకొత్త విషయం బయటపడుతోంది. తనపై లైంగిక దాడికి దిగాడని బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చి ఎట్టకేలకు జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA)పై రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన పార్టీ ఇప్పటికే ప్రజా ఒత్తిడికి లోంగి త్రిసభ్య కమిటీని నియమించి ఆయనపై విచారణ చేపట్టింది.

అయితే ఇప్పుడు బాధితురాలు మరోసారి తన లాయర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను 25 కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రచారం చేస్తున్న ఆడియోలో మాట్లాడింది తాను కాదని, అది టాంపర్ చేసిన ఆడియో క్లిప్ మాత్రమేనని, నిజంగా నేనే మాట్లాడితే పూర్తి ఆడియో బయట పెట్టాలని డిమాండ్ చేసింది. అలాగే “తాను 18 నెలల్లో పలు మార్లు అబార్షన్ అయింది” అని చెప్పినది నిజమేనని, వాస్తవానికి అది అబార్షన్ కాదని, తనకు అబార్ట్ అయిందని స్పష్టం చేసింది. అలాగే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు తనతో కాకుండా మరో ఆరు మంది మహిళలతో కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయని, అన్ని సాక్ష్యాలతో త్వరలోనే బయట పెడతానని మీడియా ముందు వివరించింది.

ఆడపిల్లకి అన్యాయం జరిగితే తల తీసే చట్టాలు తెస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు—తన పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళను మోసం చేశాడనే ఆరోపణలు వస్తుంటే కనీసం స్పందించి సస్పెండ్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రజల్లో వినిపిస్తున్న మాట. అరవ శ్రీధరే కాకుండా జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ (Kiran Royal), నర్సీపట్నం ఇంచార్జ్ రాజాన సూర్యచంద్ర (Rajana Suryachandra)—బాధితురాళ్లు బహిరంగంగా బయటికి వచ్చి నిలదీస్తున్నా, అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వారిపై కఠిన చర్యలకు దిగకుండా “వివాహేతర సంబంధాలు ఉంటే బయటికి తెలియనీయమాకండి” అని అర్థం వచ్చేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అని మహిళా లోకం నుండి వస్తున్న ప్రశ్నలు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment