---Advertisement---

కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు షాక్.. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ

February 11, 2026

Summarize with AI

---Advertisement---

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు (Kidnap Case)లో ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎంబీయూ యూనివర్సిటీ (MBU University)లో విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను యాజమాన్యం మరియు సిబ్బంది నిర్బంధించి, వారిపై దాడి చేసినట్లు ఐదుగురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మోహన్ బాబు పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. విచారణ సమయంలో బాధితుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అన్ని వాదనలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ముందస్తు రక్షణ లభించకపోవడంతో మోహన్ బాబు తదుపరి చర్యలు ఏలా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రాబోయే విచారణ ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment