---Advertisement---

ధోనీకి షాక్… జార్ఖండ్ ప్రభుత్వం నుంచి నోటీసులు

February 28, 2026

Summarize with AI

---Advertisement---

టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేందర్ సింగ్ దోని (Mahendra Singh Dhoni) కు జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (Jharkhand State Housing Board) ఊహించని షాక్ ఇచ్చింది. 2009లో జార్ఖండ్ ప్రభుత్వం (Jharkhand Government) ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ ని కేటాయించింది. స్థలం వినియోగంపై తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ ప్లాట్‌ను కేవలం నివాస అవసరాల కోసం మాత్రమే కేటాయించగా, ప్రస్తుతం అక్కడ డయాగ్నస్టిక్ సెంటర్ (Diagnostic Centre) నడుస్తోందని బోర్డు గుర్తించింది. ఇది కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ 15 రోజులలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఇంటి గోడలపై ఆయన జెర్సీ నంబర్ 7, హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్ చిత్రాలు అలరించేవి. రాంచీకి వచ్చే అభిమానులు దీన్ని సెల్ఫీ స్పాట్‌లా చూసేవారు. అయితే ప్రస్తుతం ధోనీ తన కుటుంబంతో కలిసి సిమాలియా రింగ్ రోడ్‌లోని ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. హర్ము ఆస్తి ఆయన పాత నివాసంగా మాత్రమే మిగిలింది.

ఇదిలా ఉండగా, ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా Chennai Super Kings తరఫున ఆయన ఆడే ప్రతి మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చనే ప్రచారం నేపథ్యంలో, ఈ నోటీసుల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment