---Advertisement---

TTD EO:టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం

March 6, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా(TTD EO) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా (TTD Governing Board Member Secretary) ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి (CH Venkayya Chowdary) ఆయనతో ప్రమాణం చేయించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవిచంద్ర దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, గత నెల రోజులుగా తిరుమలలో పలు విషయాలను పరిశీలించి కొత్త అనుభవాలను పొందినట్లు తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన దర్శనం, వసతి సంబంధిత సూచనలను పరిశీలించి వారికి మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment