---Advertisement---

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..ముగింపు పై ఆసక్తికర వ్యాఖ్యలు

March 10, 2026

Summarize with AI

---Advertisement---

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌లో (Iran) యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని చెప్పారు. ఇరాన్‌లో వేలాది లక్ష్యాలను ఛేదించామని, ఇది కేవలం స్వల్పకాల సైనిక చర్య మాత్రమేనని పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో (Vladimir Putin) కూడా మాట్లాడతానని తెలిపారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (Islamic Revolutionary Guard Corps – IRGC) ప్రకటన విడుదల చేసింది. యుద్ధం ముగిసే సమయం తమ సైనికుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ఇదిలా ఉండగా గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment