---Advertisement---

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి ఫిక్స్… మార్చి 14న వివాహం

March 10, 2026

Summarize with AI

---Advertisement---

టీమిండియా (Team India) స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు (Childhood Friend) వంశికతో (Vamsika) ఆయన వివాహం (Marriage) మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరుగనుంది.

వివాహానికి ముందు మార్చి 13న హల్దీ, మెహందీ వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 17న లక్నోలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశముంది.

కాన్పూర్‌కు (Kanpur) చెందిన కుల్దీప్, వంశిక చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఆ స్నేహం తరువాత ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. ప్రస్తుతం వంశిక ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తోంది. క్రికెట్‌లో స్టార్ స్పిన్నర్‌గా ఎదిగిన కుల్దీప్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment