తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions) ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) రూ.3.24 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) ఈ బడ్జెట్‌ను సమర్పించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.3,24,234 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ బడ్జెట్‌లో యువతకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తూ రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల రూ.2,000 స్కాలర్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇప్పుడు శాఖల వారీగా కేటాయింపులు ఎలా ఉన్నాయంటే
- విద్యా శాఖకు రూ. 26,674 కోట్లు
- వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు
- పశుసంవర్థక శాఖకు రూ. 1,529 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు
- కార్మిక శాఖకు రూ. 998 కోట్లు
- మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 3,143 కోట్లు
సామాజిక వర్గాల సంక్షేమానికి కూడా గణనీయమైన నిధులు కేటాయించారు
- ఎస్సీ సంక్షేమానికి రూ. 11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి రూ. 7,937 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 3,769 కోట్లు
యువత, గృహ నిర్మాణం, పరిశ్రమల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు
- రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు రూ. 7,430 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 3,490 కోట్లు
- చేనేత రంగానికి రూ. 258 కోట్లు
గ్రామీణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు చేశారు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 33,688 కోట్లు
- ఆర్ అండ్ బి శాఖకు రూ. 12,789 కోట్లు
- న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు
పట్టణాభివృద్ధి, భద్రత, ఇతర ముఖ్య రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి
- హెచ్-సిటీ (H -citi) పథకానికి రూ. 2,654 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 17,907 కోట్లు
- హోం శాఖకు రూ. 11,907 కోట్లు
- గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ. 500 కోట్లు
- పర్యాటక శాఖకు రూ. 1,224 కోట్లు
మొత్తంగా ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, యువత ఉపాధి, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.






