---Advertisement---

Military Plane Crashed: ఘోర విషాదం.. కూలిన సైనిక విమానం.. 110 మందితో వెళ్తూ ఘోర ప్రమాదం

March 24, 2026

Summarize with AI

---Advertisement---

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా (Colombia)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సైనికులను తీసుకెళ్తున్న ఒక సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి మంటల్లో దగ్ధమైంది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

దక్షిణ అమెజాన్ ప్రాంతంలో విషాదం.. పలువురు మృతి

కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130(Lockheed Martin C-130 Hercules) సైనిక విమానం ప్రమాదానికి గురైంది. దక్షిణ అమెజాన్ ప్రాంతంలో, పెరూ సరిహద్దుకు సమీపంలోని ప్యూర్టో లెగుయిజామో ప్రాంతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అనంతరం విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో వెంటనే మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 110 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. అందులో కనీసం 34 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే శిథిలాల మధ్య నుంచి సుమారు 57 మందిని సజీవంగా రక్షించినట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో(Gustavo Petro) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

హెర్క్యులస్ సి-130 విమానం ప్రపంచవ్యాప్తంగా సైనిక రవాణా కోసం విస్తృతంగా ఉపయోగించే మోడల్. 1950లలో ప్రవేశపెట్టబడిన ఈ విమానం 1960ల నుండి అనేక దేశాల సైన్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పాతబడిన విమానాల భద్రతపై ఇప్పటికే అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment