భారతీయ సినీ రంగంలో రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా ‘ధురంధర్-2’ (Dhurandhar-2) సినిమా అరుదైన ఘనత సాధించింది. కేవలం హిందీ వెర్షన్ (Hindi Version) ద్వారానే రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్లు (₹1000 Crore Net Collections) సాధించిన తొలి చిత్రంగా ఇది బాలీవుడ్ (Bollywood) చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
విడుదలై 18వ రోజుకి కూడా ఈ సినిమా వసూళ్లలో జోరు తగ్గలేదు. మూడో వారంలో భాగంగా దేశవ్యాప్తంగా 4030 షోలతో ప్రదర్శించబడిన ఈ చిత్రం ఒక్క రోజులోనే సుమారు రూ.3.82 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ స్థాయి కలెక్షన్లు రావడం సినిమా మీద ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
హిందీ వెర్షన్‌లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న ‘ధురంధర్-2’, ఓవరాల్ ఇండియా నెట్ కలెక్షన్లలో మాత్రం ఇంకా టాలీవుడ్ సినిమాలైన ‘పుష్ప-2’, ‘బాహుబలి-2’ కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం టాప్-3లో రెండు స్థానాలు దక్షిణాది సినిమాలవే కావడం గమనార్హం.






