---Advertisement---

మెగాస్టార్ సినిమా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్

April 9, 2026

---Advertisement---

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై (Vishwambhara) ఎట్టకేలకు కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. చాలా కాలంగా షూటింగ్, ముఖ్యంగా విఎఫ్‌ఎక్స్ (VFX – Visual Effects) పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా రిలీజ్‌పై స్పష్టత వచ్చినట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక దశలో ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమైనా, ప్రస్తుతం మేకర్స్ పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం ఫైనల్ టచ్ ఇస్తున్నారని తెలుస్తోంది.

బింబిసార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, తన 2వ సినిమాగా విశ్వంభరను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. యూవీ(UV) క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ఖర్చుతో రూపొందుతున్న సినిమాగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో త్రిష (Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కీలక పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే జూలై 10 రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment