తెలంగాణలో మావోయిస్టు (Telangana Maoist) ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతూ 42 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు (42 Maoists Surrendered). రాష్ట్ర డీజీపీ (Telangana DGP) శివధర్ రెడ్డి (Shivdhar Reddy) సమక్షంలో ఈ భారీ లొంగుబాటు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆయుధాలతో లొంగుబాటు.. కీలక నేతలు కూడా సరెండర్
లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు (Keshavlu) కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే బెటాలియన్ కమాండర్ దేవన్న (Devanna) లొంగిపోవడంతో, ఇప్పుడు మిగతా బృందం కూడా పోలీసులకు శరణు కోరింది. డివిజనల్, ఏరియా కమిటీ సభ్యులు కూడా ఈ లొంగుబాటులో భాగమయ్యారు.
వీరు సుమారు 40 ఆధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 41 మంది ఛత్తీస్‌గఢ్‌కు (Chhattisgarh) చెందినవారు కాగా, తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరే ఉన్నారని అధికారులు తెలిపారు. అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ పెరగడంతో తెలంగాణను ఆశ్రయించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇక క్రియాశీల మావోయిస్టు కేడర్ ఎవరూ లేరని, తెలంగాణ పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ప్రకటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు:
- సోడి మల్ల @ కేపాల్ @ నిఖిల్ (47)
- మడవి మాడ @ రవీందర్ (30)
- పునేం సుక్కు (35)
- హేమ్లా లచ్చి @ మాసే @ శీల (40)
- సోడి భీమా @ రంజిత్ (25)
- తాటి రాజు @ రంజిత్ (28)
- కోవ్యాసి రాజు @ రమేష్ (28)
- మూడియం భీమా @ రింకు (26)
- మడకం భీమా @ సునిత (28)
- పొడియం గంగి @ సుందరి (25)
- సోడి భీమి @ మాలతి (30)
- కుడం దేవి (24)
- మడకం జోగి (28)
- పునేం ఐతె @ పార్వతి (27)
- పొడియం సుంబారి @ అంజలి (20)
- మడకం ఇడుమ @ నరేష్ (24)
- కుంజం భీమా (23)
- మడకం ఇడుమ (23)
- మడవి జోగా (25)
- కుంజం సోను @ నవీన్ (20)
- పునేం సోము @ రాకేష్ (20)
- చాప నారాయణ @ గజేందర్ @ మధు (40)
- కడి సన్ను @ మంతు (40)
- మోడియం మున్ని @ మంజుల (43)
- కుంజం ఇడుమాల్ @ మహేందర్ (30)
- సుపో డొంగ @ సునీల్ (30)
- పొడియం లక్ష్మి (28)
- ముస్సాకీ దేవే (30)
- డోడ్డి సోముడు @ శంకర్ (26)
- మడవి సోమిడి @ లత (23)
- కరటం ఉరే @ రంజిత (22)
- పునేం రామే @ క్రాంతి (20)
- పునేం మోట్టు @ జగ్గు (30)
- డోడ్డి ఐతు @ కిశోర్ (40)
- గోన్నే హిడిమె (22)
- కుంజం లచ్చు (28)
- పునేం శాంతి @ సునీత (30)
- మడకం బుద్ర (45)
- కుంజం భీమా (30)
- మడకం ఉంగి (21)
- రవ్యా సన్నా @ గుడ్డు (18)
- ఆప్కా శ్రీను (20)






