---Advertisement---

జైలర్ 2లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఎంట్రీనా? రజినీకాంత్ మూవీపై భారీ సస్పెన్స్

April 11, 2026

Summarize with AI

---Advertisement---

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న జైలర్ 2 (Jailer 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జైలర్ 2లో గెస్ట్ రోల్స్ (Guest Roles) కోసం పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తన తదుపరి సినిమా లుక్ బయటకు రావద్దనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో సంచలన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. షారుఖ్ స్థానంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) కేమియో పాత్ర కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్, సమయం అనుకూలిస్తే సినిమాలు చేస్తానని గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దర్శకుడు పవన్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ రజినీకాంత్ (Rajinikanth), పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానులకు అది పండుగలా మారుతుందని చెప్పొచ్చు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment