---Advertisement---

మొన్న హృదయ్ రాజన్, నేడు అనుదీప్ కటికాల — స్టాండ్ అప్ కమెడియన్లపై జనసేన దాడి?

April 12, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Jana Sena Party) తీరు మొదటి నుండి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. తాము ఎవరినైనా విమర్శిస్తాం, ట్రోల్ చేస్తాం కానీ తమ దాకా వస్తే మాత్రం బెదిరింపులకు దిగుతాం, దాడులు చేస్తాం అన్నట్టు వారి వ్యవహారం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జీవిత ప్రయాణంపై ఎవరైనా స్టాండ్ అప్ కమెడియన్ (Stand-Up Comedian) వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడినా సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగుతున్నారు అనే వాదన బలపడుతోంది.

స్టాండ్-అప్ కామెడీని సాధారణంగా ఒక కళారూపంగా పరిగణిస్తారు. హాస్యనటులు తమ వాదనను వినిపించడానికి, సమాజంలో ఉన్న అసంబద్ధతలను ఎత్తిచూపడానికి, అధికారాన్ని సవాలు చేయడానికి లేదా వివాదాస్పద అంశాలను చర్చించడానికి ఈ వేదికను హాస్యంతో ఉపయోగించుకుంటారు.

ఈ నేపథ్యంలో స్టాండ్-అప్ కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Kattikaala), పవన్ కళ్యాణ్ మరియు ఆయన అన్న కుమార్తె నిహారిక (Niharika Konidela) విడాకులపై ఎగతాళిగా మాట్లాడారని నెపం మోపుతూ, పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే జనసేన కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషణలు చేస్తూ ఆ షోలో హంగామా చేశారు.

అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా హృదయ్ రాజన్ (Hriday Rajan) అనే స్టాండ్-అప్ కమెడియన్‌పై ఇలాగే వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. వారికి షోలో ఉపయోగించే వ్యాఖ్యలతో ఇబ్బంది ఉంటే చట్టపరంగా వెళ్లే వెసులుబాటు ఉందని, కానీ ఇలా దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే జనసేన పార్టీ నాయకులు ‘కల్చరల్ ప్రోగ్రాం’ (Cultural program) పేరుతో ఆ పార్టీ శాసన సభ్యులే మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై (Y. S. Jagan Mohan Reddy) స్కిట్లు వేసి హేళన చేశారు. అప్పుడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆనందించిన ఇదే జనసేన కార్యకర్తలు, నేడు వారి నాయకుడి విషయంలో దాడులకు దిగడం హిపోక్రసీ కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అంబటి రాంబాబు గారిని ఏకంగా వారి సినిమాల్లో ఒక అసంబద్ధ పాత్రగా చూపించి హాస్యానికి వాడుకోవడం తప్పు కాదా? దాన్ని నాడు ఆనందించిన వారు, నేడు దాడులు చేయడం సరైందా అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే, కేవలం అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడిన బెండపూడి స్కూల్ విద్యార్థులపై సినీ పరిశ్రమ నుంచి స్టేజ్ షోల వరకు, సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ చేసి ఆనందించిన ఇదే జనసేన పార్టీ, నేడు ఇలా దాడులు చేయడం చూస్తే — “తాము ఎవరినైనా విమర్శిస్తాం, ట్రోల్ చేస్తాం కానీ తమ దాకా వస్తే మాత్రం బెదిరింపులకు, దాడులకు దిగుతాం” అన్నట్టు వారి వ్యవహారం ఉందని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

1 thought on “మొన్న హృదయ్ రాజన్, నేడు అనుదీప్ కటికాల — స్టాండ్ అప్ కమెడియన్లపై జనసేన దాడి?”

  1. ఒక తరాన్ని పాడు చేశాడు పవన్ కళ్యాణ్ అనే నటుడు

    Reply

Leave a Comment