---Advertisement---

సంగీత ప్రపంచానికి తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

April 12, 2026

Summarize with AI

---Advertisement---

భారతీయ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) (92) కన్నుమూశారు (Passed Away). గత కొన్ని రోజులుగా అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ (Breach Candy Hospital) ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆదివారం ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్‌లో నిర్వహించనున్నారు.

70 ఏళ్ల సంగీత ప్రస్థానం.. 12000కు పైగా పాటలు

భారతరత్న లతా మంగేష్కర్ (Lata Mangeshkar) సోదరిగా ప్రసిద్ధి చెందిన ఆశా భోస్లే 1943లో గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు 70 ఏళ్ల కెరీర్‌లో 20 భాషల్లో 12000కు పైగా పాటలు పాడి కోట్లాది శ్రోతలను అలరించారు.

తన ప్రత్యేక గాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఆశా భోస్లే అనేక అవార్డులు అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో (Guinness Book of World Records) స్థానం సంపాదించిన ఆమెకు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke Award) వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి.

ఆమె మరణంతో సినిమా, సంగీత రంగాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆమె మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment