---Advertisement---

కవిత సంచలన నిర్ణయం.. కొత్త పార్టీ ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు షాక్

April 25, 2026

---Advertisement---

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె (KCR Daughter) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా ఆమె ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena) పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. పాత టీఆర్ఎస్(TRS) పేరుకు దగ్గరగా ఉండేలా పేరు ఎంపిక చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కుటుంబంపైనే కవిత విమర్శల దాడి

కొత్త పార్టీ ప్రకటించిన సభలో కవిత తన తండ్రి కేసీఆర్(KCR), అన్న కేటీఆర్‌లపై(KTR) తీవ్ర విమర్శలు చేశారు. “ఇప్పటి కేసీఆర్ పాత కేసీఆర్ కాదు.. ఆయన పూర్తిగా మారిపోయారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏమి సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం వల్లే పార్టీ ఈ స్థితికి చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఒకే లక్ష్యం ఉందని, తండ్రి ఫాంహౌస్‌లో ఉండాలి.. కొడుకు ముఖ్యమంత్రి కావాలనే విధంగా వ్యవహారం నడుస్తోందని ఎద్దేవా చేశారు.

కేటీఆర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేదని, ప్రజల సమస్యలు తెలియవని కూడా విమర్శించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

కవిత ప్రకటించిన 5 హామీలు

ప్రజల కోసం అధికారంలోకి వస్తే అమలు చేసే ‘పంచజన్యం’ పేరుతో 5 ప్రధాన హామీలను కవిత ప్రకటించారు.

  1. విద్య (Education)
    ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా సామాన్యులకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు.
  2. వైద్యం (Healthcare)
    జబ్బు ఏదైనా, ఆస్పత్రి ఏదైనా రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
  3. వ్యవసాయం (Agriculture)
    రైతుల పెట్టుబడి నుంచి పంట విక్రయం వరకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పారు.
  4. ఉపాధి (Employment)
    నిరుద్యోగ యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు 1 లక్ష ప్రత్యేక ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
  5. సామాజిక న్యాయం (Social Justice)
    సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment