---Advertisement---

Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి మూవీ ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

April 25, 2026

Summarize with AI

---Advertisement---

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi) విడుదల తేదీ ఖరారైంది. శాకుంతలం ఫేమ్ (Shaakuntalam Fame) దేవ్ మోహన్ (Dev Mohan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్ ఎం ఎస్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య (Tatineni Satya) దర్శకత్వం వహించారు.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Arts) సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ (Nagamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సమ్మర్ రేసులోకి అడుగుపెట్టింది. గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

మే 8న థియేటర్లలో సందడి

తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను 8 మే 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త తేదీ.. అదే ఉత్సాహం అంటూ చిత్ర యూనిట్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

ఇది ఒక వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, వారి బంధం చుట్టూ కథ సాగనుంది. ఇందులో లావణ్య త్రిపాఠి తన భర్తను తన కంట్రోల్‌లో ఉంచుకునే శక్తివంతమైన భార్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మోట్టా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే హాస్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఫీల్ గుడ్ చిత్రాలకు పేరుగాంచిన మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా సమ్మర్ సెలవుల్లో కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment