---Advertisement---

పీ4 పేరుతో ఆడబిడ్డ నిధికి మంగళం పాడేశారా?

June 13, 2026

---Advertisement---

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీలను (Promises) అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజలకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) పూర్తి అవగాహనతోనే ఈ హామీలు ఇస్తున్నామని ప్రకటిస్తూ, ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ప్రత్యేక బాండ్లను కూడా విడుదల చేసింది. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సందర్భంగా నారా లోకేష్ (Nara Lokesh) హామీలు నెరవేర్చకపోతే తమను నిలదీయవచ్చని చెప్పగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఎన్నికల ప్రచార సభల్లో సూపర్ సిక్స్ అమలు విషయంలో ప్రజలకు పదేపదే హామీ ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల (Key Promises) అమలుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెన్షన్, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, అర్హులైన అనేక మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో పథకాల నుంచి తప్పించబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవన్నింటిలో అత్యంత కీలకంగా ప్రచారం చేసిన ఆడబిడ్డ నిధి పథకం (Aadabidda Nidhi) మాత్రం ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు(Women) నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఇద్దరు మహిళలు ఉంటే రూ.3,000, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6,000 వరకు లభిస్తుందని కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఈ పథకం అమలుపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు ఈ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యాయి. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఆర్థిక పరిమితులు ఉన్నాయని, అందుకే దానికి బదులుగా పీ4 కార్యక్రమాన్ని (P4 Programme) తీసుకొచ్చామని ఆయన పేర్కొనడం మహిళల్లో తీవ్ర నిరాశకు దారితీసింది.

ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సహాయం (Financial Support) అందుతుందని ఎదురుచూస్తున్న అనేక మంది మహిళలు, ఇప్పుడు పథకం స్థానంలో కొత్త విధానాన్ని తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరించడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని, తాము ఆశించిన ప్రయోజనాలు ఎప్పుడు అందుతాయనే సందేహం నెలకొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment