ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మీడియా వ్యవహారశైలిపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసిన సంఘటనలో, ఏబీఎన్ (ABN) సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) చేసిన మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతల కుటుంబాల్లోని మహిళలను(Womens) ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య తీవ్ర నిరసనలకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శాంతియుత నిరసనలు చేపట్టింది. ఆంధ్రజ్యోతి కార్యాలయాల (Andhra Jyothy Offices) ఎదుట పెద్దఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు (Protested). మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తీరు అసహ్యకరమని పేర్కొంటూ, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో గుంటూరులో(Guntur) పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో (Ambati Rambabu) పాటు మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు నిరోధించారని వారు వెల్లడించారు. దీనికి నిరసనగా మహిళలు, పార్టీ నేతలు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
అలాగే, శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తూ పోలీసులు జులుం ప్రదర్శించారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.






