---Advertisement---

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుస “కల్తీ” ఘటనలు

February 24, 2026

---Advertisement---

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో “కల్తీ” (Adulteration) అనే పదం తరచుగా వినిపిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకటో చోట కాదు, అనేక ప్రాంతాల్లో కల్తీ ఉత్పత్తుల కేసులు బయటపడుతున్నాయి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు (Adulterated Milk) వెలుగుచూసిన ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మొలకలచెరువులో కల్తీ మద్యం (Spurious Liquor) కేసు కలకలం రేపింది. సత్తెనపల్లిలో కల్తీ సిగరెట్లు (Fake Cigarettes) బయటపడగా, పిఠాపురంలో కల్తీ నెయ్యి(Adulterated Ghee) ఘటన ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. ఇక నరసరావుపేటలో కల్తీ ఔషధాలు బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ప్రజల ఆరోగ్యం, భద్రతలతో సంబంధం ఉన్న ఉత్పత్తుల్లో ఇలాంటి కల్తీ ఘటనలు వరుసగా వెలుగుచూడడం రాష్ట్ర పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డబ్బుల కోసం కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? లేక పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రేపు ఇంకెక్కడ, ఏ రూపంలో కల్తీ బయటపడుతుందో అనేది ఊహించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment