---Advertisement---

రాకా అంటూ బర్త్‌డే బ్లాస్ట్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ పోస్టర్ వైరల్

April 8, 2026

---Advertisement---

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చింది. ఆయన బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా నుంచి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్.. సూపర్ హీరో కథపై సంకేతాలు

అల్లు అర్జున్ కెరీర్‌లో 22 సినిమా, అట్లీ కెరీర్‌లో 6 చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు రాకా (RAAKA) అనే టైటిల్‌ను (Title) ఖరారు చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. తోడేలును పోలిన శక్తివంతమైన రూపంతో కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

బ్యాక్‌గ్రౌండ్ కూడా డార్క్ మరియు ఇంటెన్స్‌గా ఉండటంతో ఈ సినిమా సాధారణ కమర్షియల్ చిత్రం కాదని, కొత్త కాన్సెప్ట్‌తో వస్తోందన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా సూపర్ హీరో (Super Hero) తరహా కథాంశంతో అట్లీ పెద్ద ప్రయోగం చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ నటి దీపికా పడుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment