వైసీపీ(YSRCP) మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu) మరోసారి కోర్టు నుంచి ఊరట లభించింది. 2023 సంక్రాంతి సంబరాల సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన లక్కీడ్రా కేసు (Lucky Draw Case) లో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది.
ముఖ్యమంత్రిపై దుర్భాషలాడిన కేసుతో పాటు పలు కేసులు నమోదవడంతో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇటీవల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో పోలీసులను బెదిరించారనే ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ఈనెల 11న గుంటూరు ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది.
అయితే ఆ కేసులో విడుదలకు సిద్ధమవుతుండగానే సంక్రాంతి లక్కీడ్రా కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడం ఆలస్యమైంది. తాజాగా ఈ కేసులో కూడా బెయిల్ రావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.






