---Advertisement---

తగ్గేదే లే స్టైల్లో అంబటి రాంబాబు.. లక్కీ డ్రా కేసులో కీలక పరిణామం!

February 12, 2026

---Advertisement---

ఏపీ (Andhra Pradesh) మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి గుంటూరు కోర్టుకు (Guntur Court) తరలించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆయన్ను కోర్టులో హాజరు పరిచారు.

లక్కీ డ్రా ఆరోపణలే కారణం

సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డిప్ (Lucky Dip) కార్యక్రమం కోసం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) లాటరీ టికెట్లు బలవంతంగా అంటగట్టారని జనసేన (Jana Sena) జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao) ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

దీనిపై అంబటి రాంబాబుపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు పీటీ వారెంట్ (PT Warrant) జారీ చేసి గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (Principal Senior Civil Judge Court, Guntur) లో హాజరు పరిచారు. వాదోపవాదనలు అనంతరం బెయిల్ లేదా రిమాండ్ పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

ఇదిలా ఉండగా కోర్టుకు వచ్చిన అంబటి రాంబాబు తన అనుచరులు, అభిమానులను ఉద్దేశించి “తగ్గేదే లే” అంటూ పుష్ప (Pushpa) సినిమాలోని పుష్పరాజ్ (Pushparaj) స్టైల్‌లో స్పందించడం ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment