---Advertisement---

అర్ధరాత్రి ఓట్ల మర్మం … ఆంధ్ర ఎన్నికల్లో అసలు ఏమి జరిగింది?

April 3, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2024 అసెంబ్లీ ఎన్నికలపై (Assembly Elections 2024) కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. అర్ధరాత్రి తర్వాత భారీగా ఓట్లు (Votes) నమోదు కావడం, కేవలం కొన్ని సెకన్లలో ఓటింగ్ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో (Delhi) నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆర్థికవేత్త పరాకాల ప్రభాకర్ (Parakala Prabhakar) ఈ అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ప్రకారం, రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు సుమారు 52 లక్షల ఓట్లు నమోదు కాగా, వాటిలో 17 లక్షల ఓట్లు అర్ధరాత్రి తర్వాతే పడినట్లు తెలిపారు. కొన్ని చోట్ల కేవలం 6 సెకన్ల వ్యవధిలో ఓటింగ్ నమోదవడం అనుమానాలకు తావిస్తోంది.

ఎన్నికల అధికారి (Election Official) చెప్పిన ప్రకారం, 3,500 బూత్‌లలో (Polling Booths) మాత్రమే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ జరిగింది. ఆ బూత్‌లలో ఒక్కో బూత్ వద్ద లైన్లో గరిష్టంగా 200 మంది మాత్రమే ఉన్నారని తీసుకుంటే, పడాల్సిన ఓట్లు సుమారు 7 లక్షలు మాత్రమే అవుతాయి. అయితే, పరాకాల ప్రభాకర్ గారు ఎన్నికల అధికారుల ఫైనల్ డేటాను ఆధారంగా తీసుకుని చెప్పినట్లుగా, రాత్రి 8 గంటల నుంచి 2 గంటల వరకు అదే పోలింగ్ బూత్‌లలో 52 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయి? 3,500 పోలింగ్ బూత్‌లలో 52 లక్షల ఓట్లు అంటే, ఒక్కో బూత్‌లో సుమారు 1,500 మంది ఓటు వేసినట్లవుతుంది. అది ఎలా సాధ్యం? సాధారణంగా ఒక పోలింగ్ బూత్‌లో గరిష్టంగా ఉండే ఓటర్ల సంఖ్య కూడా సుమారు 1,200 మాత్రమే కాదా? అనే మౌళిక ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయంశం అవుతున్నాయి.

ఇంకా చూస్తే ఇవీఎంలు ఒక్కో ఓటు తర్వాత రీసెట్ కావడానికి కనీసం 14 సెకన్లు పడుతుంటే, 6 సెకన్లలో ఓటింగ్ ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటర్ల శాతం గణాంకాల్లో జరిగిన మార్పులు కూడా సందేహాలకు కారణమయ్యాయి. మొదట ప్రకటించిన 68% పోలింగ్ శాతం, రాత్రికి 76%గా, చివరకు నాలుగు రోజుల తర్వాత 81.79%గా పెరగడం వివాదాస్పదమైంది.

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) పారదర్శకత లోపాన్ని ఎత్తిచూపుతూ, ప్రతి పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఫార్మ్ 17సి డేటాను పబ్లిక్ చేయకపోవడంపై ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలు మెషీన్-రీడబుల్ ఫార్మాట్‌లో (Machine-Readable Format) అందుబాటులో లేకపోవడం కూడా స్వతంత్ర పరిశీలనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం చీకట్లో నడవకూడదని ఆయన హెచ్చరించారు.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ (SY Quraishi) కూడా ఈ అంశాలపై స్పందిస్తూ, ఎన్నికల రికార్డులపై సమగ్ర ఆడిట్ అవసరమని సూచించారు. ఫార్మ్ 17సి, ఫార్మ్ 20 వంటి పత్రాల్లో వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. పోలింగ్ శాతం, బూత్ స్థాయి డేటాను అదే రోజున విడుదల చేయాలని ఆయన సూచించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పారదర్శకత, విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. నిజంగా అర్ధరాత్రి ఓట్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇది కేవలం గణాంకాల లోపమా, లేక మరింత పెద్ద సమస్యకు సంకేతమా అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment