---Advertisement---

ఏపీ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పరంపర

February 2, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌లో టీడీపీ–జనసేన (TDP–Jana Sena) ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా దాడుల వరుసగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వారి ఇళ్లు మరియు పార్టీ ఆఫీసులు దాడులకు గురవుతున్న ఘటనలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకుంటున్నాయి.

వలభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, పెర్ని నాని, ముద్రగడ పద్మనాభం, జోగి రమేష్, నల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ్ చౌదరి, చిత్తూరు రెడ్డప్ప, భూమన కరుణాకర్ రెడ్డి, దాడిశెట్టి రాజా వంటి పలువురు కీలక నేతల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు (TDP Party Workers) దాడులు (Attacks) చేశారు.

హిందూపురం (Hindupur)లోని వైసీపీ పార్టీ ఆఫీస్‌తో పాటు రాజమండ్రిలో మార్గాని భరత్, గుంటూరులో నంబూరి శంకర్రావు ఆఫీసులపై దాడులు జరిగాయి. అలాగే మహిళలను కూడా చూడకుండా ఉప్పల హారికా, విడదల రజనీపై దాడి చేశారు.

ఇక మాజీ మంత్రి రోజా, మరో మహిళా నాయకురాలు శ్యామల, లక్ష్మీ పార్వతీలపై డిజిటల్ వార్ కొనసాగుతోంది. కిరాక్ ఆర్పీ, సీమ రాజా లాంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణమైన బూతులు తిట్టుతూ వారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఈ దాడులు ప్రతిపక్ష నేతలకే కాకుండా డెక్కన్ క్రానికల్ కార్యాలయం (Deccan Chronicle), సాక్షీ (Sakshi Media) ఆఫీసులపై కూడా జరగడం గమనార్హం. వరుస దాడులు, విధ్వంసాలు, గృహదహనాలు చోటుచేసుకుంటుండటంతో రాష్ట్రంలో శాంతి–భద్రతల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా దాడుల పరంపర కొనసాగుతుండగా, మరోవైపు చంద్రబాబు నాయుడు “రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సక్రమంగా నడుస్తోంది” అంటూ చేసిన ట్వీట్ రాజకీయ చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment