---Advertisement---

రాష్ట్ర చరిత్రలో పొగాకును కొన్న తొలి ప్రభుత్వం ఏది ? మంత్రి మాటల్లో నిజం ఎంత?

February 28, 2026

---Advertisement---

రాష్ట్ర చరిత్రలో పొగాకును (Tobacco) కొనుగోలు చేసి రైతులను (Farmers) ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని (Coalition Government) శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చం నాయుడు (Atchannaidu) చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా రైతాంగ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యల సత్యాసత్యాలపై పలు ప్రశ్నలు వెలువడుతున్నాయి.

1976లో పోగాకు బోర్డ్ ఏర్పాటు అయిన తర్వాత నుంచి అనేక సంవత్సరాల పాటు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతిదారుల ఆధిపత్యం కొనసాగినట్లు రైతులు గుర్తుచేస్తున్నారు. లోగ్రేడ్ పేరిట ధరలను తగ్గించి, వారు నిర్ణయించిన ధరకే అమ్మకానికి రైతులు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుందని రైతులు వివరిస్తున్నారు. వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితుల్లో ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించి, 2020 ఆగస్టు 1న మార్క్‌ఫెడ్‌ ను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేలం కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ ప్రవేశంతో పోటీ వాతావరణం ఏర్పడి, తద్వారా ఐదేళ్ల పాటు రైతులకు మెరుగైన ధరలు లభించాయని చెబుతున్నారు.

అదేవిధంగా, 2022లో తొలిసారిగా ప్రభుత్వం అమెరికాకు 120 టన్నుల పొగాకును ఎగుమతి చేసిన ఘటనను కూడా రైతులు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిణామాలు దృష్ట్యా, కూటమి ప్రభుత్వమే రాష్ట్ర చరిత్రలో పొగాకును కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం అని పేర్కొనడం వాస్తవాలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment