---Advertisement---

రేపటి నుంచే ఆరోగ్యశ్రీ బంద్… పేదల ప్రాణాలకు ప్రమాద ఘంటిక.

March 31, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు (Aarogyasri) రేపటి నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయన్న ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తోంది. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) (AP Speciality Hospitals Association – ASHA) ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక భారీ బకాయిల సమస్య ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభుత్వంపై సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో (Aarogyasri Bills Pending) ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు (Network Hospitals) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక ఆస్పత్రులు అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి, కార్డుతో వచ్చే పేద రోగులను తిరస్కరిస్తున్న దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఆశ అధికారికంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి మరింత విషమించనుంది.

ఇది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2025 సెప్టెంబర్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. విజయవాడలో ధర్నాలు నిర్వహించగా, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి బకాయిలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (One-Time Settlement) ద్వారా తీర్చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీలతో సమ్మె విరమించినప్పటికీ, తర్వాత వాటి అమలు జరగలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

డిసెంబర్ నెలాఖరుకు చెల్లింపులు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మార్చి 31 దాటినా బకాయిలను క్లియర్ చేయకపోవడంతో ఆస్పత్రులు మరోసారి సమ్మె బాట పట్టాయి. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొత్త టెండర్లు పిలవడం ద్వారా పాత బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడం కూడా సంచలనంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో న్యాయపరమైన పోరాటం జరగడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపినా, బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామాలు పేద రోగులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్పత్రుల వద్ద తిరస్కరణను ఎదుర్కొంటున్న వారు, ఇక పూర్తిస్థాయిలో సేవలు నిలిచిపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే ఆరోగ్య రంగంలో భారీ సంక్షోభం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment