ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కుల రాజకీయాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రతి వ్యక్తి ఏదో ఒక కులంలో పుడతాడన్నది సహజమే. కానీ అదే కులాన్ని రాజకీయ లాభాలకు వాడుకోవడం వల్ల సమాజంలో చీలికలు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా, రాజకీయం అనే పేర్లతో రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి.
ఇటీవల తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంలో కోర్టుకు సమర్పించిన సిట్ నివేదిక రాజకీయ వేడి పెంచింది. లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని, అయితే జంతు కొవ్వు కలపలేదని నివేదిక స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
వైసీపీ నేతలు సీఎం చంద్రబాబు (Chief Minister N. Chandrababu Naidu)పై దుష్ప్రచారం చేశారంటూ ఆరోపణలు చేశారు. టీడీపీ(TDP) వారు దాడి చేస్తూ వాడిన అసభ్యకర భాష నేపధ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. దీనికి ప్రతిస్పందనగా వారి ఇళ్లపై దాడులు జరగడం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనలను కుల వివక్షగా చిత్రీకరించే ప్రయత్నమే అని అధికారపార్టీ వాదిస్తుంటే. కుల జాడ్యమే దాడికి కారణమని ప్రతిపక్షపార్టీ చెబుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాపు కులానికి చెందిన పవన్ కల్యాణ్ మౌనంగా ఉండగా, ఆయన సోదరుడు నాగబాబు (Nagababu) స్పందించారు. కులం అనేది పుట్టుకతో వచ్చేది తప్ప ఎంపిక కాదని, కానీ ఎలా జీవించాలో మన చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు బాధ్యతగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నాగబాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, కుల సంఘాల్లో ఎలాంటి స్పందన తెస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కుల భావన తెచ్చుకునన్న ఓటు వేయండి అని చేసిన ప్రసంగం గుర్తు చేస్తు . కులాల గురించి మాట్లాడే నైతిక హక్కు వీరికి ఉందా అనే ప్రశ్నలు ఏదురౌతున్నాయి.






