---Advertisement---

నాడు ‘అమ్మకం’ అంటూ విమర్శలు.. నేడు ‘అదే కొనసాగింపు’ .. ఏపీ మెడికల్ కాలేజీ సీట్లపై కూటమి యూ-టర్న్ ?

June 14, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రభుత్వ వైద్య విద్యపై (Government Medical Education) మరోసారి తీవ్ర చర్చకు దారితీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Government) ప్రారంభించిన 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) నిర్వహణ కోసం తీసుకొచ్చిన జీవో 107, 108లను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగించడమే కాకుండా, ఇప్పుడు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) (PPP విధానంలో కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా 17 కొత్త కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా, కాలేజీలే స్వయం సమృద్ధితో నడవాలనే ఉద్దేశంతో జీవో 107, 108లను అమలు చేసింది. ఈ విధానంలో 50 శాతం సీట్లను కేవలం రూ.15 వేల ఫీజుతో అందుబాటులో ఉంచగా, 35 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు (Self Finance Seats) రూ.12 లక్షలు, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు రూ.20 లక్షల ఫీజు నిర్ణయించారు. ఈ ఆదాయాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరికరాల కొనుగోలు, అధ్యాపకుల జీతాల కోసం వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు.

అయితే ఈ విధానాన్ని అప్పటి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రభుత్వ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించిన టీడీపీ(TDP), జనసేన(Jana Sena) నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవోలను రద్దు చేస్తామని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ జీవో 108ను 100 రోజుల్లో రద్దు చేస్తామని ప్రకటించగా, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా పెడన సభలో పేద విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసే నిర్ణయమని విమర్శించారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) గత ప్రభుత్వం అమలు చేసిన మేనేజ్‌మెంట్ కోటా విధానాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని, అదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన విధానాన్నే ఇప్పుడు సమర్థించడం కూటమి ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గతంలో ‘ప్రభుత్వ సీట్ల అమ్మకం’ (‘Sale of Government Seats’) అంటూ విమర్శించిన విధానాన్నే ఇప్పుడు కొనసాగించడంతో పాటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించే చర్యలు కూటమి ప్రభుత్వంపై ద్వంద్వ వైఖరి ఆరోపణలకు తావిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు సమర్ధించడం అంటే నాడు ప్రజలను మోసం చేసినట్టే కదా అని విమర్శలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment