ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలోని (Vijayawada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో (Indira Gandhi Municipal Stadium) జరుగుతున్న ఈ క్రీడా సమరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొంటూ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ముందుకు వచ్చారు. అయితే సరైన శిక్షణ, ప్రాక్టీస్ లేకపోవడం కారణంగా కొందరు ప్రజా ప్రతినిధులు గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామ రాజు (Raghurama Raju) క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అదుపుతప్పి పిచ్‌పై పడిపోవడంతో చేతికి తీవ్ర గాయం అయ్యింది. అనంతరం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ (Manipal Hospital) కు తరలించగా, ఎక్స్‌రే పరీక్షలో ఎడమ మణికట్టు వద్ద ఎముక విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్స అవసరమని సూచించగా, ఆయన హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు సమాచారం.
అలాగే కబడ్డీ పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు భుజం వద్ద కాలర్ బోన్ విరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే పార్ధసారధి పాదానికి గాయం అయినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, క్రీడల ప్రోత్సాహం మంచి లక్ష్యమే అయినప్పటికీ, ప్రజా ప్రతినిధులకు తగిన శిక్షణ మరియు సాధన సమయం కల్పించి తర్వాతే పోటీల్లో పాల్గొనివ్వాలనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. లేకపోతే గాయాల భారిన పడి ధీర్గకాలికంగా భాదలు పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.







