ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) సందర్శన కోసం రైతులకు విద్యార్థులకు అందించిన ప్రయాణ సదుపాయాల ఖర్చులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటివనరుల శాఖ నుండి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన మిస్ స్పిల్‌వే ఎంటర్‌ప్రైజెస్ (Miss Spillway Enterprises), శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ (Sri Lakshmi Enterprises) సంస్థలు (Companies) తాము అందించిన సేవలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వడ్డీతో సహా విడుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఈ రిట్ పిటిషన్ల విచారణలో భాగంగా పెండింగ్ బకాయిలను చెల్లించాలనే సూచన వెలువడింది.
2018 డిసెంబర్ నుండి 2019 మార్చి వరకు పోలవరం ప్రాజెక్టు ప్రదేశాన్ని సందర్శించిన రైతులు (Farmers), విద్యార్థుల (Students) కోసం ఆర్టీసీ గరుడ వోల్వో ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం, భోజన సౌకర్యాలు కల్పించడం వంటి సేవలకు ప్రభుత్వం 2024లో 23.11 కొట్ల పరిమితితో రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ మంజూరు చేసింది. అయితే, ఈ ఖర్చుల లెక్కల్లో పొరపాటున జీఎస్టీ అంశం చేర్చబడలేదని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గుర్తించిన నేపథ్యంలో సుమారు ₹29.15 కోట్ల జీఎస్టీ మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదించారు.
ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అవసరమైన చర్యలు తీసుకుని బకాయిలను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న పరిపాలనా లోపాలు, ఆర్థిక ప్రభావాలు, న్యాయపరమైన పరిణామాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు పోలవరం పూర్తి చేయకుండానే ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పొలవరం తరలించారని, ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని ఇప్పటికే ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.






