---Advertisement---

రైతు సంక్షేమ హామీలు ఎక్కడ? 20 నెలల్లో సున్నా వడ్డీకి రూపాయి లేదు.

February 23, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో సుమారు 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం (Agriculture)పై ఆధారపడి జీవిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు(Farmers) అందించే ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయ పథకాలపై ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి క్షీణించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu Naidu) గారు అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన 20 నెలల కాలంలో సున్నా వడ్డీ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్(Jagan Mohan Reddy) గారి నాయకత్వంలోని ప్రభుత్వం హయాంలో 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ, లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు చెల్లించిన అర్హులైన రైతుల పొదుపు ఖాతాల్లో సీజన్ ముగింపు నాటికి వడ్డీ రాయితీని జమ చేసిందని. ఐదేళ్ల కాలంలో 84.67 లక్షల రైతు కుటుంబాలకు రూ. 2,050.53 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత 20 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని రైతాంగం విమర్శిస్తోంది. వడ్డీ భారం తగ్గించడం ద్వారా రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడమే ఈ పథకం లక్ష్యమని అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఈ పధకంపై సీతకన్ను వేసిందని రైతులు మండిపడుతున్నారు.

అదేవిధంగా, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది రూ. 20 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించినప్పటికీ, మొదటి సంవత్సరం ఆ పథకం అమలు కాలేదని, రెండో సంవత్సరం కేవలం రూ. 10 వేలే జమ చేశారని రైతులు చెబుతున్నారు. తుపాన్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, సున్నా వడ్డీ పథకాన్ని అందరికీ ప్రయోజనం చేకూరేలా పారదర్శకంగా అమలు చేయాలని పలువురు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment