---Advertisement---

కన్నుమిన్నూ తెలియడంలేదా? అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేనలో తీవ్ర చర్చ

February 12, 2026

---Advertisement---

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Railway Kodur MLA Arava Sridhar) ప్రభుత్వ ఉద్యోగి వీణ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు (Sexual Harassment Allegations) రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. తనను నమ్మించి మోసం చేశారని, తన గర్భాన్ని పలుమార్లు తొలగించారని ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ (Jana Sena Party) క్రమశిక్షణ కమిటీ ముందు అరవ శ్రీధర్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే వివరణ ఇచ్చినప్పటికీ పార్టీ లోపల అసంతృప్తి చల్లారలేదని తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు ఆయన ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పరువు తీస్తున్నారా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ హాజరుకాకపోవడం మరోసారి చర్చనీయాంశమైంది. అసెంబ్లీకి రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరంగా అసెంబ్లీకి రావద్దని ఎక్కడా చెప్పలేదని, కేవలం పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలని మాత్రమే సూచించామని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడి పని చేసి, కేసులు ఎదుర్కొని, జైళ్లకు వెళ్లి ఈ స్థాయికి చేరుకున్నామని, ఇప్పుడు కొందరి చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వచ్చిన వెంటనే కొందరికి బాధ్యతలు మరచిపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment