---Advertisement---

ఆగని లీకులు.. అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో వీడియో విడుదల, మలుపు తిరిగిన వివాదం

February 5, 2026

---Advertisement---

రోజుకో వీడియోతో ఉత్కంఠ పెంచుతున్న వీణ ఆరోపణలు

జనసేన ఎమ్మెల్యే (Jana Sena Party MLA) అరవ శ్రీధర్‌ (Arava Sridhar)కు సంబంధించిన వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. తనను మోసం చేసి, అత్యాచారం చేశాడంటూ వీణ (Veena) అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణలు ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఐదు సార్లు అబార్షన్ చేయించారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా, ఇప్పుడు వరుసగా వీడియోలు (Videos) బయటకు రావడం ఉత్కంఠను మరింత పెంచుతోంది.

ఇప్పటికే చాటింగ్, వీడియో కాల్స్‌కు సంబంధించిన క్లిప్పులు విడుదల చేసిన వీణ, తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. ఈ వీడియోలో అరవ శ్రీధర్ కారు నడుపుతుండగా, వీణ అతడి పక్కనే కూర్చుని ఉన్నట్లు కనిపిస్తోంది. గన్నవరం వైపు వెళ్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. వీణ నవ్వుతూ మాట్లాడుతుండగా, శ్రీధర్ మాత్రం సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై అరవ శ్రీధర్ ఇటీవల స్పందించాడు. ఇది తనకు, ఆమెకు మధ్య వ్యక్తిగత వ్యవహారమని, జనసేన పార్టీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు, వీణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, నేషనల్ మహిళా కమిషన్ కూడా విచారణకు ఆదేశించింది. ఇప్పటికే జనసేన పార్టీ అంతర్గత కమిటీ శ్రీధర్‌ను విచారించినప్పటికీ, తదుపరి చర్యలపై ఇంకా స్పష్టత రాలేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment