ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit)లో బిల్ గేట్స్ (Bill Gates) పాల్గొంటారా లేదా అన్న సందిగ్ధతకు ఎట్టకేలకు ముగింపు పలికింది. నేడు జరగనున్న కీలక ఏఐ సదస్సులో ఆయనకు ద్వారాలు మూసుకుపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఏఐ సదస్సులో ఆయన ప్రసంగించబోరని గేట్స్ ఫౌండేషన్ ఇండియా విభాగం స్పష్టం చేసింది. బిల్ గేట్స్ స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా-ఇండియా అధ్యక్షుడిగా ఉన్న అంకుల్ ఓరా (Ankul Ora) ప్రసంగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో బిల్ గేట్స్ కు వ్యతిరేకంగా #QuitIndia హ్యాష్‌ట్యాగ్ తీవ్రంగా ట్రెండ్ అవుతుండగా, ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్ గేట్స్‌ను దూరంగా ఉంచాలన్న వాదనలు మొదటి నుంచే వినిపించాయి. గత కొన్ని రోజులుగా ఆయన ప్రసంగిస్తారా లేదా అన్న దానిపై హైడ్రామా కొనసాగింది. చివరికి అధికారిక ప్రకటనతో ఈ ఉత్కంఠకు తెరపడింది.
ఇక అంతర్జాతీయంగా సంచలనం రేపిన ఎప్‌స్టీన్ కేసుతో సంబంధం ఉన్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభం శుభం తెలియని చిన్నారులను తమ వికృత లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారని వెలుగులోకి వచి్చంది. బిల్ గేట్స్‌కు ఆయన భార్య మెలిందా గేట్స్ కొంతకాలం క్రితం విడాకులు కూడా ఇచ్చారు. ఆయన అక్రమ, అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేక ఆమె విడాకులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను రాష్ట్రానికి ఆహ్వానించి ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ‘సంజీవిని’ ప్రాజెక్టులో (Sanjeevini Project) భాగస్వామ్యం చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఖమ్మం జిల్లాలో గిరిజన బాలికలపై నిర్వహించిన వ్యాక్సిన్ ట్రయల్స్ వివాదం, అలాగే భారత్‌ను ప్రయోగశాలగా ఉపయోగిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి బిల్ గేట్స్‌ను దూరంగా ఉంచిన నిర్ణయం మరిన్ని రాజకీయ, సామాజిక చర్చలకు దారి తీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.






