---Advertisement---

రష్యన్ మహిళలతో ఎఫైర్లు – తప్పు ఒప్పుకున్న బిల్ గెట్స్

February 26, 2026

---Advertisement---

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, బిల్ గెట్స్(Bill Gates) తాజాగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై ఆయన చేసిన ప్రకటనలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించింది.

గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) సిబ్బందితో వాషింగ్టన్‌లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో, తాను ఇద్దరు రష్యన్ మహిళలతో (Russian Women) వ్యక్తిగత సంబంధాలు కొనసాగించిన విషయాన్ని అంగీకరించినట్లు వెల్లడించింది. వారిలో ఒకరు బ్రిడ్జ్ క్రీడాకారిణి కాగా, మరొకరు రష్యాకు చెందిన అణు భౌతిక శాస్త్రవేత్తగా పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో, జఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) తో తన పరిచయంపై కూడా గేట్స్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2013లో తన మాజీ భార్య(Wife) మిలిందా గేట్స్ (Melinda Gates) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, తాను ఎప్స్టీన్‌తో సమావేశాలు కొనసాగించిన విషయాన్ని అంగీకరించినట్లు నివేదిక పేర్కొంది. 2014లో అతనితో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడాన్ని కూడా తప్పుగా ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇటీవల భారత పర్యటన సందర్భంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సందర్శనపై వ్యక్తమైన రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. వివిధ రాజకీయ వర్గాలు మరియు మీడియా సంస్థలు ఈ పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన ఆరోపణలపై ఇప్పుడు బిల్గేట్స్ నుండి వచ్చిన స్టేట్మెంట్ రాజకీయ, మీడియా వర్గాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment