తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆరు గ్యారంటీల (Six Guarantees) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు (Promises) కేవలం మాటలకే పరిమితం కాకుండా వాటికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసును స్పీకర్‌కు (Speaker), అసెంబ్లీ కార్యదర్శికి (Assembly Secretary) సమర్పించారు.
చట్టబద్ధతతోనే లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనం
ఆరు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ (Legal Status) కల్పిస్తేనే లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం అందుతుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ బిల్లుతో పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని వారు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును చర్చకు తీసుకురావాలని స్పీకర్‌ను వారు కోరారు. త్వరితగతిన అనుమతి ఇచ్చి సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.






