---Advertisement---

రాజ్యసభ వేదికగా బయటపడ్డ చంద్రబాబు శ్వేతపత్రంలోని డోల్లతనం?

March 17, 2026

---Advertisement---

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై(State Financial Condition) విడుదల చేసిన శ్వేతపత్రాలు (White Papers) ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అప్పట్లో వెల్లడించిన లెక్కలు నిజమా కాదా అనే అనుమానాలు తాజా పరిణామాల నేపథ్యంలో మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లకు చేరాయని చేసిన ప్రకటనలు ఇప్పటికే కాగ్(CAG) నివేదికల ద్వారా అసత్యాలని తెలిపోయాయి.

ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) (Electric Distribution Companies – DISCOMs) అప్పుల (Debts) విషయంలో కూడా శ్వేతపత్రం విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, గత ప్రభుత్వ కాలంలో డిస్కంల బకాయిలు రూ.1,12,422 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ గణాంకాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని తాజాగా వెలుగులోకి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వ (Central Government) ప్రకటన ప్రకారం, 2025 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ డిస్కంల మొత్తం బకాయిలు రూ.77,583 కోట్లు మాత్రమే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ (Shripad Yesso Naik) వెల్లడించారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించడంతో, శ్వేతపత్రంలో పేర్కొన్న లెక్కలు సత్యాసత్యాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు విడుదల చేసే అధికారిక పత్రాలు ఎంతవరకు నిజానిజాలను ప్రతిబింబిస్తున్నాయి? రాజకీయ ప్రయోజనాల కోసం గణాంకాలు వక్రీకరించబడుతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment