---Advertisement---

వెలిగొండ – శ్రీరాం సాగర్! చంద్రబాబు ద్వంద వైఖరి?

February 28, 2026

---Advertisement---

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి రాజకీయ వైఖరిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy), ఏడు కొండల అంశం తరువాత ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) శంకుస్థాపన రాయి చుట్టూ సాగుతున్న ప్రచారం ఆయన ద్వంద రాజకీయ ధోరణిని మళ్లీ చర్చనీయాంశంగా మార్చింది.

1993 జూన్‌ 30న అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు (P. V. Narasimha Rao) గారు ముప్కాల్ మండల కేంద్ర శివారులో శ్రీరాం సాగర్ వరద కాలువకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో పనులు పూర్తి చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుని టెండర్లు పిలిచి ప్రారంభించారు. అనంతరం 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆ సందర్భంలో రామారావు గారి నుండి అధికారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది.

1995 సెప్టెంబర్ 14న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న పీ.జనార్ధన్ రెడ్డి శ్రీరాం సాగర్ వరద కాలువ పనులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి స్పందించిన చంద్రబాబు నాయుడు, 1993లో శంకుస్థాపన జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అయితే ఇదే అంశం ఇప్పుడు ఆయనకే ప్రశ్నగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1996 మార్చిలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు చూపిస్తూ, ఆ ప్రాజెక్టు ఘనత పూర్తిగా తనదేనని ప్రచారం చేసుకోవడం విరుద్ధ వైఖరికి ఉదాహరణగా నిలుస్తోందని పలువురు చెబుతున్నారు. శంకుస్థాపన జరిగినప్పటికీ తదుపరి తొమ్మిదేళ్లపాటు ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయలేదని నీటి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకప్పుడు శ్రీరాం సాగర్ కాలువ విషయంలో “శంకుస్థాపనకే పరిమితమయ్యారు” అంటూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసిన చంద్రబాబు గారు, ఇప్పుడు వెలిగొండ శంకుస్థాపన రాయిని చూపిస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం సహజంగానే ఆయన ద్వంద వైఖరిపైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వెలిగొండ శంకుస్థాపన రాయిని వేసిన సమయంలోనే పల్నాడులో వరికపుడిసెల ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. మరీ ఆ ప్రాజెక్టు ఎందుకు చర్చలో లేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మరో వైపు పల్నాడు రైతాంగం నుండి ఏదురవుతున్న ప్రశ్న.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment