సోమవారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ-పరిపాలన వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిల్ గేట్స్ (Bill Gates) రాష్ట్రానికి చేరుకొని నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu)తో సమావేశమయ్యారు. గన్నవరం వచ్చిన ఆయనకు నారా లోకేష్(Nara Lokesh) ఎయిర్‌పోర్ట్ లో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంకు చేరుకున్న గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు.
ఆర్టీజీఎస్ నుంచి సంజీవని వరకు చర్చలు
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని (Real Time Governance Centre) గేట్స్ సందర్శించారు. టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ (Bill & Melinda Gates Foundation) సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జరుగుతున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చ జరిగింది. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్టు పురోగతిని చంద్రబాబు వివరించారు.
ఈ భేటీలో గేట్స్ బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్ కూడా పాల్గొన్నారు.






