---Advertisement---

మద్యం మత్తులో డ్రైవింగ్.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

April 7, 2026

---Advertisement---

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో ఆయనను అరెస్ట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కేసు నమోదు

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో భాగంగా వార్నర్ కారును ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో ఆయన రక్తంలో ఆల్కహాల్ శాతం అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత షూరిటీపై విడుదల చేశారు.

ఈ కేసులో భాగంగా వార్నర్ వచ్చే నెల మే ఏడు తేదీన సిడ్నీలోని స్థానిక కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేరానికి సంబంధించి ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పీఎస్ఎల్ మధ్యలో సిడ్నీకి వెళ్లిన వార్నర్

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో తన స్వస్థలం సిడ్నీకి వెళ్లారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో అగ్రశ్రేణి ఓపెనర్‌గా పేరు సంపాదించిన వార్నర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment