---Advertisement---

ప్రధాని మొడీని మహిళా ఎంపీలు కొరకబోయారు..! దీపక్ రెడ్డి వివాదాస్పద వాఖ్యలు .!

February 6, 2026

---Advertisement---

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న టీడీపీ నేత, జేసీ దివాకర్‌రెడ్డి (JC Diwakar Reddy) అల్లుడు దీపక్‌రెడ్డి (Deepak Reddy) మరోసారి తీవ్ర చర్చకు దారి తీసే వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించేందుకు సిద్ధమైన సమయంలో లోక్‌సభలో చోటుచేసుకున్న ఘటనపై ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, విపక్ష మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

ప్రధాని మోదీపై మహిళా ఎంపీలు దాడి చేసేందుకు ప్రయత్నించారనీ, ఆయుధాలు లేకపోవడంతో తమ పళ్లనే ఆయుధాలుగా ఉపయోగించబోయారని చేసిన వ్యాఖ్యలతో యాంకర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రశ్నను తిరిగి అడిగినా దీపక్‌రెడ్డి అదే వ్యాఖ్యలను పునరుద్ఘాటించడంతో స్టూడియోలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇదే తొలిసారి కాదు. గతంలో ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం సమయంలో రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న దీపక్‌రెడ్డి, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu)తో పాటు మంత్రి లోకేష్(Lokesh) పేరు ప్రస్తావించడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఆ వ్యాఖ్యలపై యాంకర్ అర్నాబ్ గోస్వామి ప్రశ్నించగా, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇక మరో ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో, దీపక్‌రెడ్డి వ్యాఖ్యలు ఎన్డీయేలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీల ప్రతిష్టని దేశవ్యాప్తంగా దిగజార్చుతున్నాయనే అభిప్రాయం ఆయా పార్టీల నుండే ఆఫ్ ది రికార్డ్ గా వినిపిస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment