బాలీవుడ్లో సంచలన విజయాన్ని సాధించిన ధురంధర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ (Dhurandhar 2)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్చి 19న పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ పార్ట్ సాధించిన భారీ విజయాన్ని మించిపోయేలా ఈసారి మరింత ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో, ఆకట్టుకునే విజువల్స్‌తో సినిమాను రూపొందించినట్లు సమాచారం.
ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమాకు భారీ స్పందన కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గల్ఫ్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి
మొదటి భాగం గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) సెన్సార్ సమస్యల కారణంగా నిషేధానికి గురై నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. అయితే తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు గల్ఫ్ ప్రాంతం నుంచే అత్యధిక వ్యూస్ రావడం విశేషం. పాకిస్థాన్‌లో కూడా సినిమాకు ఊహించని ఆదరణ లభించింది.
ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి గల్ఫ్ దేశాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలయ్యేలా మేకర్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వివాదాలకు తావులేకుండా కంటెంట్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. గల్ఫ్ రిలీజ్ సాఫీగా జరిగితే, ‘ధురంధర్ 2’ వసూళ్లు కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.






