---Advertisement---

ప్రభుత్వ బడుల్లో అధ్వాన్నంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.

March 11, 2026

---Advertisement---

ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై (Dokka Seethamma Mid-Day Meal Scheme) మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దేవునిచెరువు ఎంపీపీ పాఠశాలలో (MPP School) జరిగిన ఘటన ఈ పథకం అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత మూడు నెలలుగా విద్యార్థులకు నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. భోజనం రుచి లేకపోవడం, పచ్చిగా ఉండడం వల్ల తట్టుకోలేని స్థితికి చేరుకున్న చిన్నారులు తాము తినాల్సిన అన్నాన్ని డస్ట్‌బిన్‌లో పారబోసిన ఘటన కలకలం రేపింది.

పాఠశాల విద్యార్థులు (Students), వారి తల్లిదండ్రులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. చివరికి విసిగిపోయిన తల్లిదండ్రులు అత్యవసర సేవల నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా “మేము ఈ అన్నం తినలేకపోతున్నాం” అంటూ చిన్నారులు పోలీసుల ముందే కన్నీరు పెట్టుకోవడం అక్కడున్న వారిని కలిచివేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకానికి రూ.2161 కోట్ల బడ్జెట్ కేటాయించామని ప్రచారం చేస్తున్నప్పటికీ, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే పలు పాఠశాలల్లో ఆహార నాణ్యత లోపంతో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుని విద్యార్థులు అనారోగ్యానికి గురైన సంఘటనలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయని పలువురు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, హోం మంత్రి వసతి గృహంలో వడ్డించిన భోజనంలో బొద్దింక బయటపడిన ఘటన కూడా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సందేహాలు మరింత పెంచిందని అంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment