---Advertisement---

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…ఇరాన్ నుంచి వచ్చిన సుప్రీం లీడర్ ఆఫర్‌పై క్లారిటీ.

March 26, 2026

---Advertisement---

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇరాన్‌తో(Iran) జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాను ఇరాన్ సుప్రీం లీడర్ (Supreme Leader) పదవికి ఆఫర్(Offer) అందుకున్నానని చెప్పడం పెద్ద చర్చకు దారి తీసింది.

“నవ్వి తిరస్కరించాను”.. ట్రంప్ వ్యాఖ్యలు

ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, కొంతమంది ఇరానీయులు (Iranians) తనకు ఇరాన్ సర్వోన్నత నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని సూచించారని వెల్లడించారు. అయితే, “నేను నవ్వి (Laughed) ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇరాన్ సుప్రీం లీడర్ కావాలని అనుకోడు” అని వ్యాఖ్యానించారు.

ఇక ఇరాన్ యుద్ధంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే ఇరాన్‌పై ఆధిపత్యం సాధించిందని, ఇరాన్ త్వరలో ఒప్పందానికి (Agreement) రావాలని చూస్తోందని తెలిపారు. కానీ, ఒప్పందం చేసుకుంటే సొంత ప్రజలే వ్యతిరేకంగా మారతారనే భయంతో ఇరాన్ వెనుకడుగేస్తోందని అన్నారు.

అదేవిధంగా, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని (Nuclear Program) నిలిపివేయాలని, ఉగ్రవాద సంస్థలకు (Terrorist Organizations) మద్దతు ఇవ్వడం ఆపాలని, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవాలని అమెరికా పలు ప్రతిపాదనలు పంపినట్లు ట్రంప్ వెల్లడించారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. అయితే తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేసిన అంశంపై ఇరాన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment