పెట్టుబడులు పెరగడం, వరుసగా మూడేళ్లపాటు పంట దిగుబడి లేకపోవడం… చివరకు అప్పుల ఊబిలో చిక్కుకుని ఓ యువ రైతు (Young Farmer) ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన కర్నూలు జిల్లాలోని (Kurnool District) ప్యాపిలి మండలం జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మాధవరం గ్రామానికి చెందిన దర్శినేని నాగకృష్ణ (Darsineni Nagakrishna) (36) తనకున్న రెండు ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరుగుతుండగా, పంటలు విఫలమవడంతో చేసిన అప్పులు (Debts) క్రమంగా పెరిగి సుమారు రూ.10 లక్షలకు చేరుకున్నాయి.
అప్పులు (Debts) తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన నాగకృష్ణ, తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య కళావతి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న నాగకృష్ణ మృతితో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.






