---Advertisement---

హెలీప్యాడ్ స్థలంపై చంద్రబాబు ఆరోపణల వెనుక నిజం లేదు.

February 7, 2026

---Advertisement---

జగన్ మోహన్ రెడ్డిగారు హెలీప్యాడ్ కోసం ఒక రైతు భూమిని 22ఏలో పెట్టారని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంగళగిరి వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు స్పష్టం చేశారు. తాడేపల్లి ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆ స్థలం చరిత్ర తనకు స్పష్టంగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆ స్థలం ఎప్పటికీ వ్యవసాయ భూమి కాదని, అది రైల్వేకు చెందిన భూమి మాత్రమేనని తెలిపారు.

గతంలో ఆ భూమిని కొన్నేళ్లపాటు ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి లీజుకు ఇచ్చిన విషయం కూడా రికార్డుల్లో ఉందన్నారు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఆ స్థలం రైల్వే భూమిగానే నమోదు అయి ఉందని స్పష్టం చేశారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేయడం మానుకోవాలని దొంతిరెడ్డి వేమారెడ్డి గారు హితవు పలికారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment