---Advertisement---

హిందూపూరంలో మైనర్ బాలికపై టీడీపీ కీచకుడి వికృత చేష్టలు

February 16, 2026

---Advertisement---

రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న మైనర్ బాలికలపై దాడుల ఘటన తాజాగా మరోసారి చర్చనీయశం అయింది. కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలకి చెందిన కిందస్థాయి నాయకులు మైనర్ బాలికలనే లక్ష్యంగా చేసుకుంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తాజాగా హిందూపురంలో (Hindupuram) వెలుగుచూసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులను ఆందోళనకు గురి చేసింది.

రాయిచోటిలో (Rayachoti) ప్రేమ పేరుతో మైనర్ బాలికను (Minor Girl) వేధింపులకు గురిచేసేసరికి ఆమే ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒక టీడీపీ(TDP) నేతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఏడుగుర్రాలపల్లి ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. టుని పట్టణంలో మైనర్ బాలికతో టీడీపీ నేత అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కూడా బాలికల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ మైనర్ బాలికపై అత్యాచారం జరగడం ఆడపిల్లల బద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ పరిణామాల మధ్య తాజాగా హిందూపురంలో టీడీపీకి చెందిన ఒక స్థానిక నాయకుడు మైనర్ బాలికను మోసపూరితంగా ట్రాప్ చేసి, ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు మరియు ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

మైనర్ బాలికల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, రాజకీయ ప్రలోభాలకు లోబడకుండా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ఈ వరస సంఘటనలు రాష్ట్రంలో బాలికల రక్షణ వ్యవస్థపై తీవ్ర సందేహాలు కలిగిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment