---Advertisement---

యువకుల ఊచకోత.. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ భారీ స్కోర్

February 6, 2026

---Advertisement---

జింబాబ్వే (Zimbabwe)లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club) మైదానంలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ (Under-19 World Cup) ఫైనల్‌లో భారత జట్టు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ (India), ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి నుంచే దూకుడు ప్రదర్శించింది.

డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అసాధారణ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తనవైపుకు తిప్పేశారు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి స్టేడియాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదడంతో పాటు 71 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో వేగవంతమైన 150 నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా కూడా నిలిచారు. అయితే త్రుటిలో డబుల్ సెంచరీని మిస్ చేస్తూ మానీ లమ్స్‌డెన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు.

వైభవ్‌కు కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్థ శతకం (53)తో మంచి సహకారం అందించగా, అభిజ్ఞాన్ కుందు 40, వేదాంత్ త్రివేది 32 పరుగులతో జట్టుకు బలమైన స్కోర్ అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు తీయగా, మోర్గాన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు, మానీ ఒక వికెట్ సాధించారు.

మొత్తంగా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ టైటిల్ గెలవాలంటే 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment